అంగరాగాల నోము.
స్త్రీలు ఆచరించవలసిన నోములలో అంగరాగాల నోము ఒకటి. అందం కోరుకునేవారు,ఆనందం కావాలని అభిలషించేవారు, సిరి-సంపద, పసుపు, కుంకుమ, సౌభాగ్యం, పాడి - పంటలు, సుఖ - సంతోషాలు ఇహపరాలయందు సౌఖ్యం, పుత్ర - పౌత్రాభివృద్ధిని ఆకాంక్షించే వారు ముఖ్యంగా స్త్రీలు ఈ నోము చేయవచ్చు.
" అంగరాగాల నోము అనుభవాల గీము "
అని చెప్పి శిరస్సున అక్షతలు వేసుకోవాలి. అనంతరం అయిదు బొట్టుపెట్టెలు, అయిదు కాటుకభరిణెలు, అయిదు కుంకుమ భరిణెలు, అయిదు దువ్వెన్నలు, అయిదుసవరములు, అయిదు అగరవత్తులు కట్టలు, అయిదు గంధపు చెక్కలు, అయిదు నల్లపూసలు, అయిదు బంగారు పూలు లేదా పూలు, అయిదు అద్దములు, అయిదు చీరలు, తెప్పించి అయిదుగురు సువాసినీ స్త్రీ లను పిలచి వారికి తలంటి నీళ్లు పోసి, పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టవలెను. శ్రద్ధాభక్తులతో దక్షిణ, తాంబూలం, వాయనం ఇవ్వవలెను. ఈ నోము యవ్వనవతులు చేయవలెను. శ్రద్ధతో చేయవలెను. భక్తితో ఆచరించవలెను. ఫలము సిద్దించగలదు.
అంగరాగాల నోము పాట.
1 . రండి తెలిసుకోండి రారండి మీరు
అందాలనోమిది ఆనందాల నోమిది
సిరి సంపద లిచ్చు శుఖ శాంతుల నిచ్చి
పసుపు - కుంకుమ నిచ్చు పాడి పంటల నిచ్చు
సంతాన మిచ్చునది సంతోష మిచ్చునది
ఆడువారందరూ హాయిగా చేయొచ్చు
అంగరాగాల నోము అనుభవాల గేము
ఇహమందు సుఖము పరమందు సౌఖ్యము
కలుగజేసే నోము కలిగించు నోము.
2 . విషయాలు తెలుసుకొని వివరంగా మీరు
ఆచరించండి ఫలమను భవించండి
బొట్టుపెట్టెలు లయిదు కాటుకకాయలు
సవరాలు, దువ్వెన అగరువత్తులు తెచ్చి
నల్లపూసలు, పూలు, గంధపు చెక్కలు
అద్దములు, వస్త్రాలు, ఆభరాణాదులు
ఐదేసి తెప్పించి అందముగ ఉంచి
దక్షిణ, తాంబూల వాయనము లిచ్చి
భక్తి శ్రద్ధలతోడ చేయాలినోము.
3 . ముత్తయిదువులను మీరు ముందుగా పిలిచి
అభ్యంగన స్నానాలు చేయించి వారికి
మంచి వస్త్రాలు ఇచ్చి మర్యాదలను చేసి
పిండి వంటలతోను భోజనంపెట్టి
ఏలోటు రాకుండా నోము చేయాలి
ఇహమందును - పరమందు సుఖము పొందాలి
భక్తితో చేసిన ఫలము సిద్ధించును
శక్తి కొలది చేసి స్త్రీలందరూ మీరు
అంగ రాగాలతో హాయిగా ఉండండి.
మంచి చేకూరును మర్యాద కలుగును
యువతులందరకిది యుక్తమైన నోము
యుగయుగా లందునా చేసేటి నోము.
Posted by YAMUNA
0 Comments